Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Natu Natu: రాజమౌళి అలా చెబితే.. ఇలా అద్భుతం చేశారు చంద్రబోస్

హైదరాబాద్: మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాట. ఈ పాట రాసిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అస్కార్ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది.

నాటు నాటు: చంద్రబోస్‌కు రాజమౌళి సూచనలు

నాటు నాటు: చంద్రబోస్‌కు రాజమౌళి సూచనలు

అయితే, ఈ పాట రాసేందుకు చంద్రబోస్ ప్రాణం పెట్టారు. ఏకంగా ఏడాదికిపైగా సమయం తీసుకున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి కీలక సూచనలే కారణం. ఆ పాట అచ్చ తెలుగులో ఉండాలని.. ఎక్కడా ఇంగ్లీష్ పదాలు వాడొద్దన్నారు. అంతేగాక, ఎవర్నీ కించపరిచేలా పదాలు ఉండకూడదని.. కేవలం మన పౌరుషం, మనలోని నిజాయితీ, మన మట్టి మనిషి జీవితాన్ని పాట ద్వారా ఆవిష్కరించగలిగేలా ఉండాలని రాజమౌళి సూచించారు.

‘నాటు నాటు' పాట నెలలోనే 90 శాతం పూర్తి.. మిగితాది 19 నెలలు

‘నాటు నాటు' పాట నెలలోనే 90 శాతం పూర్తి.. మిగితాది 19 నెలలు

ఈ క్రమంలో నాటు నాటు(Natu Natu) పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబోస్. పాట కోసం ఎంతో శ్రమించారు. 90 శాతం పాటను నెల రోజుల్లోనే పూర్తి చేసిన చంద్రబోస్.. మిగితా పాటను పూర్తి చేసేందుకు ఏకంగా 19 నెలలు తీసుకోవడం గమనార్హం. ఈ పాటను 35 రకాలుగా పాడారని.. పలు విధాలుగా కొన్ని నెలలపాటు ప్రయోగం చేయడం జరిగిందని చంద్రబోస్ తెలిపారు. ప్రతి పదం, ప్రతి అక్షరం పూర్తి పాట రూపంలోకి తీసుకురావడానికి 19 నెలలు పట్టిందని.. అయితే, ఆ కష్టమే ఇప్పుడు ఊహించని విధంగా ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందించిందని చంద్రబోస్ చెప్పారు.

బాహుబలికి ఛాన్స్ రాలేదు కానీ.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్: చంద్రబోస్

బాహుబలికి ఛాన్స్ రాలేదు కానీ.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్: చంద్రబోస్

బాహుబలిలో పాటలు రాసే అవకాశం రాలేదని.. అయితే, ఆర్ఆర్ఆర్‌లో వచ్చిన అవకాశంతో.. ఏకంగా అస్కార్ అవార్డు రావడం జీవితానికి సార్థకత లభించిందని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఏకాగ్రత, చిత్తశుద్ధి, నిజాయితీతో రాసిన పాటకు.. ప్రపంచ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు సాహిత్యంతో ముడిపెట్టి.. ఒక్క ఆంగ్ల అక్షరం లేకుండా రాసిన పాటకు.. అంతర్జాతీయ అవార్డ్ ఆస్కార్ రావడం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవమని చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

తెలుగు పదాల్లోనే సంగీతముందన్న చంద్రబోస్

తెలుగు పదాల్లోనే సంగీతముందన్న చంద్రబోస్

అంతేగాక, ఆస్కార్ వేదికగా కూడా తెలుగు భాష ప్రాముఖ్యతను చంద్రబోస్ వెల్లడించారు. తెలుగు పదాల్లోనే సంగీతం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం తరగని సంపద అని చెప్పారు. కీరవాణితోపాటు చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటతోపాటు మనదేశం నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు కూడా ఆస్కార్ అవార్డు వరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+