షాకింగ్: కూతుర్ని ప్రేమించాడు, సవతి కొడుకును చంపించిన తల్లి
చౌటుప్పల్: హైదరాబాద్ సమీపంలోని చౌటుప్పల్‌లో దాదాపు రెండు నెలల క్రితం చోటు చేసుకున్న హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సచిన్ అనే యువకుడిని రెండు నెలల క్రితం సవతి తల్లి... గౌస్ అనే కిరాయి వ్యక్తితో హత్య చేయించింది.
ఇందుకు సంబంధించి పోలీసులు గౌస్‌ను, సవతి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. సచిన్ తన సవతి తల్లి కూతురును ప్రేమించాడు. తన కూతురును సవతి కొడుకు సచిన్ ప్రేమించిన విషయం తెలిసి.. అతని పాత స్నేహితుడు గౌస్‌ను హత్యకు పురమాయించింది.

సచిన్‌ను చంపేస్తే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడంతో పాటు ఆస్తిని మొత్తం ఇస్తానని ఆఫర్ చేసింది. దీంతో గౌస్ అతనిని హత్య చేశాడని తెలుస్తోంది. చిన్న క్లూ ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు. మద్యం దుకాణంలోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించారని తెలుస్తోంది. సవతి తల్లి, గౌస్ పోలీసుల అదుపులో ఉన్నారు.












Click it and Unblock the Notifications