Dogs: రాష్ట్రంలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. వికారాబాద్ జిల్లాలో బాలుడిపై దాడి..

వికారాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డాడు.

తెలంగాణలో వీధి కుక్కలు స్వైరవీహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కుక్కల దాడిలో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. కొద్ది రోజలు క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేట లో ప్రదీప్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇందుకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా స్పందించారు.

ఈ ఘటన అనంతరం జీహెచ్ఎంసీ భారీగా ఫిర్యాదులు కూడా వచ్చాయి. కుక్కల దాడిలో బాలుడు చనిపోవడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ మేయర్ ను తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేశారు. మార్చి 12న ఖమ్మం జిల్లాలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు.

Street Dogs Attacked on 4 Years Old Boy In Vikarabad District

జిల్లాలోని రఘునాథపాలెం మండలం పుటాని తండాకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్ ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించారు. బాలుడిని హైదరాబాద్ తరిలించే క్రమంలో మృతి చెందాడు. ఈ ఘటన మరవక ముందే వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో వీధి కుక్క ఓ బాలుణ్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుణ్ని కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+