తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్ భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్స్ (ST Telemedia Global Data Centres India) ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ. 3500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
సింపూర్‌లోని ఎస్‌టీటీ డాటా సెంటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓ డాటా సెంటర్ నిర్వహిస్తున్న ఎస్‌టీటీ.. ముచ్చర్ల మీర్‌ఖాన్‌పేట్‌లో మరో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఎస్‌టీటీ డేటా సెంటర్స్ సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్
మారుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌ను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్‌టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఏఐ రెడీ డేటా సెంటర్‌ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
Telangana strengthens its position as a global tech hub. ST Telemedia Global Data Centres India (@sttgdcindia) has signed an MoU with the Telangana Government to establish a state-of-the-art data centre campus in Hyderabad's Meerkhanpet.
— Telangana CMO (@TelanganaCMO) January 18, 2025
With an investment of ₹3,500 crore, the… pic.twitter.com/2TL2viaKif
ప్రస్తుతం STT GDC హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ దేశంలో వచ్చే పదేండ్లలో దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు పెడుతోంది.












Click it and Unblock the Notifications