వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసరలో మరో విద్యార్థి బలవన్మరణం, కారణమిదే, స్టూడెంట్స్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

బాసరలో విద్యార్థులు ఆందోళనలు చల్లారడం లేదు. తమ సమస్యలపై కదం తొక్కిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ వీసీని నియమించాలని కోరగా.. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఫుడ్ బాగోలేదని.. ఇతర పలు సమస్యలను చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సురేశ్ అనే విద్యార్థి హాస్టల్‌లో ఉరి వేసుకున్నాడు.

లవ్ ఫెయిల్యూర్..

లవ్ ఫెయిల్యూర్..

ప్రేమ వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో విద్యార్థిని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ నో యూజ్.. విద్యార్థి చనిపోయాడని వైద్యులు తెలిపారు. సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి అని మిత్రులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనిపై పేరంట్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇంతలోనే తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. విద్యార్థి చనిపోవడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. సీఐ వాహనాన్ని ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో పోలీసు బలగాలను మొహరించారు.

పురుగుల అన్నం

పురుగుల అన్నం


ఇంతకుముందు బాసర త్రిపుల్ ఐటీలో పురుగుల అన్నం తినడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వర్సిటీ హాస్టల్ మెస్‎లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళనలను ఉధృతం చేశారు. వర్సిటీకి పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. వీసీ లేకపోవడం వల్ల వర్సిటీలో వసతులు సరిగాలేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

స్టూడెంట్ సూసైడ్

స్టూడెంట్ సూసైడ్


మెస్ కాంట్రాక్టర్ కూడా మార్చాలని డిమాండ్ చేశారు. వర్సిటీ హాస్టల్ హాల్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని, హాస్టల్ నిర్వహణ వర్సిటీ చేతుల్లో ఉండాలనే డిమాండ్ వచ్చింది. వివిధ సమస్యలపై వారు కదం తొక్కారు. ఇంతలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.

English summary
student suresh suicide at basara iiit for his love failure. students are agitation at campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X