విద్యార్థిని స్వాతిని అభినందించిన కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని స్వాతికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభినందించారు. ‘మంచి మార్కులు సాధించావు.. నీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చదువుకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది' అని ముఖ్యమంత్రి విద్యార్థినికి హామీ ఇచ్చారు.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఆకుల స్వాతి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్యలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది.
వరంగల్ జిల్లా ధర్మాసాగర్ మండలం ఎల్కుర్తి శివారు నర్సింగరావుపల్లికి చెందిన ఆకుల స్వాతి ఇంటర్మీడియట్‌లో వేయికి 990 మార్కులు పొందింది. పేద కుటుంబానికి చెందిన స్వాతి చదువు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, బాగా చదివి వృద్ధిలోకి రావాలని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

కెసిఆర్‌ను కలిసిన స్వాతి
ఇంటర్ విద్యార్థిని స్వాతికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభినందించారు.

కెసిఆర్‌ను కలిసిన స్వాతి
‘మంచి మార్కులు సాధించావు.. నీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చదువుకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది' అని ముఖ్యమంత్రి విద్యార్థినికి హామీ ఇచ్చారు.

కెసిఆర్‌ను కలిసిన స్వాతి
ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఆకుల స్వాతి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్యలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది.

కెసిఆర్‌ను కలిసిన స్వాతి
పేద కుటుంబానికి చెందిన స్వాతి చదువు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, బాగా చదివి వృద్ధిలోకి రావాలని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications