తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు చురకలు- తక్షణ చర్యలకు ఆదేశాలు
Kancha Gachibowli: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చెట్ల నరికివేత వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఇందులో జోక్యం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి మరో విడత కీలక ఆదేశాలను జారీ చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల అటవీ భూమిలో కొద్దిరోజుల కిందట చెట్ల నరికివేత విస్తృతంగా కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా అక్కడ తలదాచుకుంటోన్న వణ్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. వణ్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి వారి ఆందోళనలు కొనసాగాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. 400 ఎకరాల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు సమక్షానికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. మధ్యంతర నివేదికను అందజేయాలంటూ తెలంగాణ హైకోర్టను గతంలో ఆదేశించింది.
ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరోసారి ఆదేశాలను ఇచ్చింది. కంచ గచ్చిబౌలిలో 100 ఎకరాల భూమిలో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణుల స్థితిగతులపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలంటూ తెలంగాణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిప్ మసీతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అలాగే- చెట్ల నరికివేత వల్ల ఆవాసాలను కోల్పోయిన వణ్యప్రాణులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అటవీ మంత్రిత్వ శాఖ వణ్యప్రాణుల సంరక్షణ విభాగం వార్డెన్‌కు ఈ ఆదేశాలను ఇచ్చింది.
తక్షణమే ఆ అటవీ జంతువుల స్థితిని పరిశీలించాలని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని పేర్కొంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అన్ని చెట్లను నరికివేయడం ఆందోళనకరమని అన్నారు.
చెట్లను నరికివేసిన ఆ వంద ఎకరాల్లో ఓ తాత్కాలిక జైలును నిర్మించి, అధికారులను అందులోకి తరలించితే ఆనందంగా ఉండగలరా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. చట్టపరంగా తీసుకోబోయే కఠిన చర్యలను నుండి తనను తాను కాపాడుకోవాలనుకుంటే- ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరించాలో ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో తమ ముందుకు రావాలని జస్టిస్ గవాయ్ సంబంధిత మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
పునరుద్ధరణకు వ్యతిరేకించే అధికారులకు తాత్కాలిక జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వంద ఎకరాల్లో చెట్ల నరికివేతపై మంత్రులు లేదా అధికారులు ఇచ్చిన వివరణల ప్రకారం తాము నిర్ణయాలను తీసుకోదలచుకోలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. వీధికుక్కల బారిన పడకుండా కొన్ని వణ్యప్రాణులు తమను తాము కాపాడుకోవడానికి ఆశ్రయం కోసం పరిగెత్తిన వీడియోలు బాధించాయని పేర్కొన్నారు.
ప్రైవేట్‌గా పెంచుకున్న అడవులు లేదా చెట్లను నరికివేయడానికి కూడా కోర్టు అనుమతి అవసరమౌతుందని అన్నారు. పర్యావరణానికి జరిగిన నష్టం తమను ఆందోళనకు గురి చేస్తోందని, 1996 నాటి ఆదేశాన్ని ఉల్లంఘించే ఏ చట్టాన్ని కూడా తాము సహించబోమని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications