ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కీలక నిర్ణయం..!!

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకు న్నాయి. వరుసగా రెండో రోజు జరిగిన విచారణలో భాగంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. ఈ కేసులో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవటం పైన సుప్రీం కీలక అంశాలను ప్రస్తావన చేసింది.

కీలక వ్యాఖ్యలు
రెండో రోజు విచారణలో భాగంగా అసెంబ్లీ న్యాయవాది సింఘ్వీ పలు అంశాలను కోర్టుకు నివేదిం చారు. మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి అని సింఘ్విని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సుప్రీం ర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతోందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ రోజు విచారణలో ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని, స్పీకర్ తర పున కూడా చెపుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయవాది ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారని న్యాయవాది అన్నారు. దీంతో ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

supreme-court-reserved-the-judgement-of-brs-mlas-disqualification-case

సీఎం వ్యాఖ్యలపై
గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని జస్టిస్ గవాయ్ అన్నారు. దీనికి స్పందించిన అభిషేక్ మను సింఘ్వి ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం అని ధర్మాసనం పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు దిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. మేము సంయమనం పాటిస్తున్నామని, మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు పిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూసారని సింఘ్వి అన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడివరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణకు వచ్చిన తర్వాతే నోటీసులు ఇచ్చారని గవాయ్ అన్నారు.

తీర్పు రిజర్వ్
అభిషేక్ మను సింఘ్వి వాదనలు ముగియడంతో.. పిటీషనర్ల తరపున కౌశిక్ రెడ్డి తరపు న్యాయ వాది ఆర్యామ సుందరం మరోసారి చివరి వాదనలు వినిపించారు. స్పీకర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది ఆర్యామ సుందరం పేర్కొన్నారు. జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించాక స్పీకర్ నోటీసులు ఇచ్చారని, మూడు వారాలు సమయం ఇచ్చారని, ఆ మూడు వారాల సమయం కూడా పూర్తి అయిందని న్యాయవాది సుందరం అన్నారు. నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+