సిఫార్సు: పీవీకి భారతరత్న, సార్‌కు పద్మవిభూషణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేసింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మ విభూషణ్, ప్రొఫెసర్ జి. రామిరెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.

వీరితోపాటు పద్మశ్రీ అవార్డుకు సీనియర్ డైరెక్టర్ జి. నర్సింగారావు, చిత్రలేఖన కళాకారుడు కాపు రాజయ్య పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయాలని నిర్ణయించింది.
మరికొంత మంది పేర్లను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితాపై సిఎం కె చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేసి కేంద్రానికి పంపనున్నారు.












Click it and Unblock the Notifications