అదృశ్యమైన టెక్కీ దారుణ హత్య: డబ్బు ఇవ్వలేదని స్నేహితుడే చంపేశాడు(పిక్చర్స్)

హైదరాబాద్: రెండ్రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హష్మీ దారుణహత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మీ అదృశ్యంపై కుటుంబసభ్యులు మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు కార్యాలయం నుంచి బయటికి వెళ్లిన హష్మీ తిరిగి రాలేదని గుర్తించారు. విస్తృతంగా గాలించి లింగంపల్లి సమీపంలోని రైలు పట్టాల వద్ద హష్మీ హష్మీ మృతదేహాన్ని గుర్తించారు. హష్మీని అతని స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

సెల్‌ఫోన్‌, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నరేష్ కుమార్ రెడ్డి.. హష్మి బైక్‌ని ఒకరోజు క్రితం తీసుకొచ్చి అతని కుటుంబసభ్యులకు అప్పగించాడు. హష్మి ఏదో రైలెక్కి వెళ్లిపోతానని చెప్పాడని అతని కుటుంబసభ్యులకు తెలిపాడు నరేష్.

అనుమానం వచ్చిన పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు అవసరం ఉండి హష్మిని అడిగాడని, ఇవ్వకపోవడంతోనే అతడ్ని నరేష్ బండరాళ్లతో మోది హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

హష్మి మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన హస్మి గత కొంతకాలంగా నగరంలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. హష్మి ఇంటి సమీపంలోనే నరేష్ కూడా నివాసం ఉంటున్నాడని చెప్పారు. నిందితుడు నరేష్ వద్ద నుంచి మృతుడు హష్మి పర్సు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సీసీఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు తెలిపారు. కాగా, హష్మీ ఏపీ సీపీఎం నేత మధు సమీప బంధువు.

హత్యకు గురైన హష్మీ(ఫైల్)

హత్యకు గురైన హష్మీ(ఫైల్)

రెండ్రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హష్మీ దారుణహత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

తల్లిదండ్రులతో హష్మీ

తల్లిదండ్రులతో హష్మీ

హష్మీ అదృశ్యంపై కుటుంబసభ్యులు మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు కార్యాలయం నుంచి బయటికి వెళ్లిన హష్మీ తిరిగి రాలేదని గుర్తించారు.

హంతకుడు నరేష్

హంతకుడు నరేష్

విస్తృతంగా గాలించి లింగంపల్లి సమీపంలోని రైలు పట్టాల వద్ద హష్మీ హష్మీ మృతదేహాన్ని గుర్తించారు. హష్మీని అతని స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు గురైన హష్మీ

హత్యకు గురైన హష్మీ

సెల్‌ఫోన్‌, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నరేష్ కుమార్ రెడ్డి.. హష్మి బైక్‌ని ఒకరోజు క్రితం తీసుకొచ్చి అతని కుటుంబసభ్యులకు అప్పగించాడు.

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

గుర్తు తెలియని మహిళను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ నవభారత్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతిరాలికి 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటుందని, గొంతుపై కత్తిపోట్లు, చేతిపై కత్తి గాట్లు ఉన్నాయని తెలిపారు. మృతురాలు నీలం రంగు చీర ధరించి ఉంది.

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వేగంగా వెళ్తున్న ఆల్టో కారును కేత్రియాల్ వద్ద రెండు లారీలు ఢీకొనడంతో కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆర్మూరు మండలం ఆలూరు వాసులుగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+