తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపే విడుదల
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు(మే 10- బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు.
కాగా, మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,84,620 మంది హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఫలితాల ప్రాసెసింగ్ కూడా ఇటీవలే ముగిసింది. దీంతో ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్దులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలను వివిధ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
కాగా, తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో నిలిచిన విషయం విధితమే.
మరోవైపు, నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా, 67.27 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.












Click it and Unblock the Notifications