మైనర్ల నిర్వాకం: లారీ కింద నలిగి మరణించిన బాలుడు
హైదరాబాద్: మైనర్ బాలుర నిర్వాకం వల్ల వారిలో ఒకతను ప్రాణాలు కోల్పోయాడు. స్కూటీ వెనక సీట్లో కూర్చున్న 12 ఏళ్ల బాలుడు లారీ కింద పడి మరణించాడు. స్కూటీని 13 ఏళ్ల బాలుడు నడుపుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
హైదరాబాదులోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని దాటేయాలనే ఉత్సాహంతో 14 ఏళ్ల బాలుడు స్కూటీని వేగంగా నడిపించాడు. ఈ క్రమంలో వెనక సీట్లో కూర్చున్న 12 ఏళ్ల బాలుడు రియాజ్ కింద పడ్డాడు.

లారీ అతనిపై నుంచి దూసుకెళ్లడంతో అతను మరణించాడు. రెండో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మైనారిటీ దాటని పిల్లలకు వాహనం ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
మృతుడు మొహమద్ రియాజ్ మదర్సాలో చదువుతున్నాడు. జునైద్ అనే 14 ఏళ్ల బాలుడు నడిపాడు. ఆ స్కూటీ అతని బంధువుది. స్కూటీపై ఆ ఇద్దరు బాలురు ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో కిషన్‌బాగ్ వైపు వెళ్తున్నారు.
కట్ట మైసమ్య ఆలయం దాటగానే జునైద్ లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. లారీ అప్పటికే అతి వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో లారీ స్కూటీని ఢీకొట్టింది. దీంతో రియాజ్ లారీ కింద పడ్డాడు. లారీ టైర్ కింద రియాజ్ తల నలిగిపోయింది.
లారీ డ్రైవర్ సోమలను పోలీసులు అరెస్టు చేశారు. స్కూటీ యజమానిపై కూడా పోలీసులు కేసు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications