Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టార్గెట్ ఈటల, ముఖ్య నేతల రహస్య భేటీ - అమిత్ షా సమక్షంలో...!!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీలో బండి సంజయ్ వర్సస్ ఈటల రాజేందర్ గా నేతల మధ్య విభజన కనిపిస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజేందర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులపై లీకులివ్వటం ఏంటని నిలదీస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్దం కావటం లేదంటూ వాపోతున్నారు. ఇదే సమయంలో అమిత్ షా పర్యటన ఖరారైంది.

బీజేపీ నేతల సమావేశం:తెలంగాణ బీజేపీ పదవుల లొల్లి మొదలైంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడి స్థానం నుంచి మార్చుతున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో డీకే అరుణ..ఈటల రాజేందర్ కు కీలక పదవులు అప్పగించబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రత్యేకంటా భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితుల పైన చర్చించారు.

Telangana BJP Leaders Angry over Etela Rajender leaks on party positions after his delhi tour

ఈటల రాజేందర్ శైలి పైనే వారు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. చేస్తున్నారు. పార్టీ నియమావళిని ఈటల పాటించడంలేదని, పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఉండగా ఢిల్లీకి వెళ్లి పదవులపై లీకులివ్వాల్సిన అవసరమేంటని మండిపడుతున్నారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, విజయశాంతి, వివేక్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

రాజేందర్ లీకులపై ఆగ్రహం:ఈటల రాజేందర్ గతంలో పార్టీలోకి ముఖ్య నేతలను తీసుకొస్తానని చెప్పి చేరికల కమిటీ చైర్మన్‌గా ఏం చేసారని పార్టీ నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. అందులోనే సక్సెస్ కాని రాజేందర్ కు మరో ముఖ్య పదవి ఇస్తే సక్సెస్ అవుతారా అంటూ అభిప్రాయపడ్డారు. నేతల మధ్య వ్యక్తిగత విభేదాలుంటే వాటిని పార్టీకి ఆపాదించడం ఏంటని ఆక్షేపించారు. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని గుర్తు చేశారు.

జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో తెలియటం లేదని వాపోయారు. బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటే అనేలా విస్తృతంగా ప్రచారం జరగాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం కోరుకుంటోందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల నిజామాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడి గృహప్రవేశం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా తారసపడటం ఆ పార్టీ వ్యూహంలో భాగంగా జరిగిందే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమితా షా పర్యటన వేళ:పార్టీలో జరుగుతున్న పరిణామాలతో క్యాడర్‌ కొంత అయోమయానికి గురవుతున్న వైనాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లామని, దీంతో అసలు తమకు సంబంధం లేకుండా ఎలా లీకులిస్తున్నారని వారు ప్రశ్నించారని చెప్పారు. ఎన్నికల వేళ అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో సభలో పాల్గొంటున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో అన్ని అంశాల చర్చిస్తారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో పాటుగా పార్టీలో పదవులు..ఎన్నికల కార్యాచరణ పైన స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. దీంతో..అమిత్ షా రాక సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+