తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక రైలులో తిరుపతికి కెసిఆర్: పది జిల్లాల ప్రజలకు అవకాశం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌లో వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ... శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని చెప్పారు.

అందుకోసం ఓ ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు.
ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డితే తిరుమ‌ల శ్రీవారికి రూ.5 కోట్ల కానుక‌లు కూడా ఇస్తాన‌ని కేసీఆర్ మొక్కుకున్నట్లు గతంలోనే ఆయన ప్రకటించారు.

కేసీఆర్ తిరుమ‌ల వెంక‌న్న‌కు మొక్కులు తీర్చుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలోనే జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం తిరుమల వెంకన్నకు ఏడు కోట్ల ఆభరణాలు కానుకగా ఇవ్వనున్నారు.

telangana cm kcr going to tirupati on special train

తిరుపతికే కాకుండా అజ్మీర్‌కు కూడా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటామన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అజ్మీర్ వెళ్లి వసతి సౌకర్యాలపై చర్చించి వచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు చేయించేందుకు రూ.57 లక్షలతో బంగారు కిరిటం తిరుచానురు అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక కురువ వీరభద్రస్వామికి 25 గ్రాములతో బంగారు మీసాలు సమర్పించనున్నారు. వీటి మొత్తం విలువ రూ.59 లక్షలుగా అంచనా వేశారు.

English summary
telangana cm k chandrasekhar Rao said that he will going to tirupati on special train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X