TSRTC Strike: ఏపీతో పోలికా!: వారే హంతకులంటూ కేసీఆర్ ఆగ్రహం

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 5 అర్ధరాత్రి లోగా విధుల్లో చేరిన ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. విధులకు చేరని ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థతో సంబంధాలు తెగిపోయినట్లేనని ప్రకటించారు.

ఎక్కడాలేని విధంగా 67శాతం జీతాలు పెంచాం

ఎక్కడాలేని విధంగా 67శాతం జీతాలు పెంచాం

ఆర్టీసీ కార్మికులకు ఎక్కడా లేని విధంగా 67శాతం జీతాలు పెంచామని కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని శాఖల్లో చేసినట్లే ఆర్టీసీ 4760 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేశామని తెలిపారు. తాము ప్రజల కడుపు నింపినం కానీ.. ఎవరీ పొట్టా కొట్టలేదని అన్నారు. పేద ప్రజల సంక్షేమ పథకాల అమలులో తెలంగాణకు ఇతర రాష్ట్రాలు సమీపంలో కూడా లేవని పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తాయా?

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తాయా?

కేంద్రం తీసుకొచ్చిన 2019 మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారమే తాము నడుచుకున్నామని తెలిపారు. తమపై ఆరోపణలకు దిగుతున్న బీజేపీ నేతలు.. పార్లమెంటులో చట్టం చేస్తున్న సమయంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు ఎందుకు మద్దతు పలికారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు శవాలమీద పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడైనా.. ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీన ప్రభుత్వంలో విలీనం చేసిందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

కోర్టు చెప్పలేదు..

కోర్టు చెప్పలేదు..

ఆర్టీసీపై తాము తప్పుడు లెక్కలు ఇచ్చినట్లు కోర్టు ఎక్కడా అనలేదని, అడ్వకేట్ మాత్రమే అన్నారని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కోర్టుకు సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉండే ఆస్కారమే ఉండదని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌కు ఎంత కేటాయించామన్న దాని మీద హైకోర్టుకు కామెంట్ చేసే అధికారం ఉండదని, ఎక్కడ ఎంత ఇవ్వాల్సి ఉంటుందో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు.

టీఎస్ఆర్టీసీనే.. కేంద్రాన్ని వాటా అడుగుతాం..

టీఎస్ఆర్టీసీనే.. కేంద్రాన్ని వాటా అడుగుతాం..

కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫి చేసి.. తెలంగాణ ఆర్టీసీని మనుగడలోకి తెచ్చిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 9వ షఎడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ ప్రతినిత్యం ప్రజల రవాణాతో ముడిపడిందని.. రెండు రాష్ట్రాల మధ్య విభజన కొద్దిపాటి వివాదాలతో ఆగిపోయిందని కేంద్రం దృష్టికి తెస్తే.. కేంద్రం ఇచ్చిన అనుమతితోనే రెండు రాష్ట్రాల స్వతంత్రంగా ఆర్టీసీలను ఏర్పాటు చేసుకున్నాయని అన్నారు.

అంతేగాక, కేంద్ర ప్రభుత్వం 31 శాతం వాటాతో ఆర్టీసీ బోర్డులో ఉందని.. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పుడు.. ఆ విషయాన్ని 31 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగిన తర్వాతే చెప్తామని కోర్టుకు తెలియజేశామన్నారు. ఐదేళ్లలో వచ్చిన నష్టాల్లోనూ మీ వాటాను భరించాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

వారే హంతకులు..

వారే హంతకులు..

ఆర్టీసీ కార్మికులు చనిపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పనిచేసుకుని బతికేవాళ్లకు యూనియన్లు, ప్రతిపక్షాలు లేనిపోని మాటలు చెప్పి అరాచకాలు సృష్టిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు వందశాతం ప్రతిపక్షాలు, యూనియన్లే బాధ్యత వహించాలని అన్నారు. వారే హంతకులను వ్యాఖ్యానించారు.

ఏపీతో పోలికేంటి?

ఏపీతో పోలికేంటి?

ఏపీలో ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీన విలీనం చేస్తున్నామని చెప్పారని.. అది వాళ్ల ఇష్టమని.. ఆ నిర్ణయాలతో తమకేం సంబంధమని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీలో రైతు భరాసాలో కేవలం రూ. 12,500 ఇస్తున్నారని.. ఇదే తెలంగాణలో రైతు బంధు పథకం కింద ఐదెకరాలు ఉన్న రైతుకు రూ. 50వేలు ఇస్తున్నామని, తెలంగాణలో గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతు భీమా కింద రూ. 5లక్షలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే ట్రిఫిక్ పోలీసులకు తెలంగాణలో రిస్క్ అలవెన్స్ ఇస్తున్నామని.. ఇవన్నీ ఏపీలో లేవని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా 25 సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. 23 కేటగిరీల్లో చిరుద్యోగులకు జీతాలు పెంచామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+