శభాష్ రేవంత్ రెడ్డి... ఇదేకదా కావల్సింది!!

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యాడ్స్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అనే స్లోగన్ బాగా వైరలైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంవల్ల ఎటువంటి మార్పును చూపిస్తామన్నామో అదే చేసి చూపిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిని అనే భావనను ఆయన విడనాడుతున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు.. వాటి పరిధి మాత్రం ప్రజలకు మంచి పరిపాలన అందించేంతవరకే.

రాజయకీ ప్రత్యర్థి ఎవరైనా కావొచ్చు.. మంచంలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించడమే అసలైన రాజకీయ పరిణతి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో రేవంత్ ఇదే చూపించారు. రేవంత్ విషయంలో కేసీఆర్ ఎంత కక్ష చూపించారో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చూశారు. కానీ వాటిని ముఖ్యమంత్రి అవగానే రేవంత్ మర్చిపోయారు. ప్రజలకు మెరుగైన పాలన అందుతోందంటే అందులో ప్రతిపక్ష పార్టీదే కీలక పాత్ర. అటువంటి పాత్రను కేసీఆర్ ఇప్పుడు పోషించబోతున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పదునైన విమర్శలు చేస్తేనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మెరుగైన పాలన అందించగలుగుతుందనే షయాన్ని రేవంత్ గ్రహించారు. కేసీఆర్ వెంటనే కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించి వచ్చారు.

telangana cm revanth reddy latest update

ట్విట్టర్ ద్వారా పరామర్శించడమే కాకుండా ఆసుపత్రికి వెళ్లి నేరుగా పరామర్శించి వచ్చారు. తనను తిట్టిన కేటీఆర్ భుజం తట్టి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీచేశారు. యశోద ఆసుపత్రి నుంచి సెక్రటేరియట్ కు తిరిగివెళ్లే క్రమంలో 'రేవంత్‌ అన్నా.. మీతో మాట్లాడాలి'' అంటూ ఓ మహిళ సీఎంను అభ్యర్థించారు. తమ సమస్యను పరిష్కరించాలని సదరు మహిళ ముఖ్యమంత్రిని కోరారు. వెంటనే స్పందించిన ఆయన.. ఆమె దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతోందని.. సాయం చేయాలని కోరారు. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన ఐదురోజుల్లోనే పాలనపై తనదైన ముద్ర వేసిన రేవంత్ మున్ముందు పరిపాలనలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+