రేపు, ఎల్లుండి సీఎం రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసా కేసీఆర్?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సుడిగాలి పర్యటన జరపనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రేపు సంగారెడ్డిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆరోతేదీన మహబూబ్ నగర్ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఏడోతేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు.

ఏడోతేదీన వేములవాడలోని రాజరాజేశ్వరి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఎనిమిదో తేదీన హైదరాబాద్ పాతబస్తీలో రెండో దశ మెట్రో పనులను, తొమ్మిదోతేదీన ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి 12వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు.

telangana cm revanth reddy seven days tour schedule

ప్రధానమంత్రి మోడీతో కలిసి ఆదిలాబాద్ లో జరిగిన సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రాలకు పెద్దన్నలా వ్యవహరించాలని, రాష్ట్రాలకు చేయూతనివ్వాలని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని, మిగతా సమయాల్లో కేంద్రం, రాష్ట్రం కలిసి అభివృద్ధి దిశగా పయనిస్తాయన్నారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్రానికి బదిలీ చేసినందుకు రేవంత్ మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరిని అవలంబించడంవల్ల రాష్ట్రాలకే ప్రమాదం అని, అభివృద్ధి కుంటుపడుతుందని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళతామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+