రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. నేడు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఆదివారం కావడంతో ఆ నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమవుతాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నిధులను సీఎం విడుదల చేస్తున్నారు.
రైతు భరోసాపై సీఎం రేవంత్ ట్వీట్
ఈ కార్యక్రమానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాతల కోసం అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతు ధైర్యంగా సాగు మడిలో నిలబడేందుకు భరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు.

రైతే రాజు అని రుజువు చేస్తూ పథకం అమలు
అలాగే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల విడుదలను నేడు చేస్తున్నట్టు తెలిపిన ఆయన, సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు…
— Revanth Reddy (@revanth_anumula) March 22, 2026
రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన
కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి, నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామన్నారు. దీనికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాల తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు మహోత్సవం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
రైతు మహోత్సవం స్టాల్స్ సందర్శించనున్న సీఎం రేవంత్
వ్యవసాయానికి సంబంధించి, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 150 స్టాల్స్ ను ఆయన సందర్శిస్తారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నాన్ని మరోమారు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా చెప్పారు. గత కొంతకాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిధులను విడుదల చేస్తున్నానని చెప్పి భరోసా ఇచ్చారు. రైతన్నకు అండదండగా నిలబడడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications