రేవంత్ సర్కార్ పండగ లాంటి వార్త.. వీరికి రెండు గేదెలు ఫ్రీ.. ఎంపిక ఎలాగంటే..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు దగ్గరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ.. తదితర అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది రేవంత్ సర్కార్.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకుంటోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే తాజాగా రాష్ట్రంలోని పాడి రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో కొత్తగా ఇందిరా డెయిరీ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈమేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇందిరా డెయిరీ పథకం కింద ప్రతి లబ్దిదారుడికి రెండు గేదెలు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు భట్టి తెలిపారు.
రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరా డెయిరీ పథకం కింద ప్రతి లబ్దిదారుడికి రెండు గేదెలు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మధిర క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరా డెయిరీ పథకం అమలు తీరుపై అధికారులతో చర్చించారు. లబ్ధిదారులు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా గేదెల పంపిణీ ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇందిరా డెయిరీ పథకం విధి విధానాలను ప్రస్తావించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ పథకం వర్తించాలంటే భూమి ఉండాలన్న నిబంధన లేదని ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే గేదెలు లేని వారికి ఇందిరా డెయిరీ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ప్రధానోద్దేశం.. పాడి రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా.. వారి జీవనోపాధిని మెరుగుపరచడం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications