హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదల: పరీక్షలు ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2022, ఈ-సెట్ నోటిఫికేషన్ సోమవారం విడదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్-2022, ఈ సెట్-2022 పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి.

ఎంసెట్ పరీక్షల దరఖాస్తు.. జనరల్‌ అభ్యర్థులకు ఫీజు రూ.800గా విద్యాశాఖ పేర్కొంది. బీఈ, బీటెక్‌, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

telangana eamcet and ecet notification eleased

ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఉంది. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ జరుగనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ జరుగనున్నట్లు ప్రకటన చేసింది.

మరోవైపు, ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. జులై 13 న ఎంట్రెన్స్ జరుగన్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్ మాసం 6 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి.

ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) ఈ పరీక్షను నిర్వహించనుంది.

English summary
telangana eamcet and ecet notification released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X