వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TS EAMCET Results 2021: ఎంసెట్ ఫలితాల విడుదల... విద్యార్థులు ఇలా చెక్ చేసుకోండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఇవాళ(ఆగస్టు 25) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, మెడికల్‌ విద్యార్థుల ఫలితాలను కూడా విడుదల చేశారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి :

ముందుగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.inని ఓపెన్ చేయాలి.
.వెబ్‌సైట్ లో TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్,పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
చివరగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

telangana eamcet results 2021 here is the details of how to check scores

ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులను కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. ఈ నెల 30 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ఇంకా వెల్లడించలేదు.

Recommended Video

ఏడేళ్లుగా జరిగిన అభివృద్దిపై పెదవి విరిచిన మూడుచింతలపల్లె గ్రామస్తులు..!! || Oneindia Telugu

ఈ నెల 4,5,6 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు.

English summary
Telangana Eamcet 2021 results will be released today (August 25) at 11 am. Education Minister Sabita Indrareddy will release the results.Here is the procedure to check results
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X