తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. ఒక్కో దానికి రూ.145 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలను నవీకరిస్తూనే కొత్తగా మరికొన్నింటిని నిర్మించేందుకు సిద్ధం అవుతోంది. గురకులాల్లో అధికంగా పేద, మధ్య తరగతి విద్యార్థులే ఉంటారు. ఈ క్రమంలో వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది. ఈ మేరకు ఐదు గురుకులాలకు టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే వీటి నిర్మాణం చేపట్టనుంది రేవంత్ సర్కార్.

తెలంగాణలోని విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది. ఈ మేరకు ఐదు ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వీటి నిర్మాణం చేపట్టి పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతిని కల్పించనుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులంలో దాదాపు 2500 మంది విద్యార్థులు వసతి పొందేలా వీటిని నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో గురుకులానికి రూ. 145 కోట్లు ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

తొలుత రాష్ట్రంలోని కొడంగల్, హుజూర్ నగర్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మరో ఐదు అవి.. కొల్లాపూర్, వరంగల్ తూర్పు, హుస్నాబాద్, షాద్‌ నగర్, ఆందోల్ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించేందుకు సిద్ధమైంది. త్వరలోనే నిర్మాణాలను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నిర్మించనున్న ఈ గురుకులాల్లో పిల్లలు 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాభ్యాసం చేయవచ్చు. ఈ గురుకులాల్లో అత్యాధునిక లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు త్వరలో రాష్ట్రంలోని గురుకులాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుకుంటామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యాభ్యాసం, వసతి, పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పాత గురుకులాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాలయాల పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Telangana Government Approves Five New Integrated Gurukuls at Rs 145 Crore Each

అంతేకాక త్వరలో రాష్ట్రంలోని గురుకులాల్లో టైమింగ్స్ మారనున్నట్లు సమాచారం. కొత్త టైమింగ్స్ పై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని గురుకులాల సెక్రటరీలతో సమావేశం జరిపి తగిన చర్యలు తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+