హైదరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆ స్థానంలో.. 21 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అనూహ్యంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను తప్పించింది. హైదరాబాద్ కొత్త పోలీసు కమిషనర్ గా మహేష్ భగవత్ నియమితులయ్యారు. అదే విధంగా మరో 20 మంది సీనియర్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు చేసింది. సజ్జనార్ ను ఫైర్ డీజీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అనూహ్యంగా హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ ను తప్పించింది. ఆయనను ఫైర్ డీజీగా నియమించారు. హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్ కు బాధ్యతలు కేటాయించారు. అదే విధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ని అక్కడ నుంచి మార్పు చేసారు.

Telangana Government Transfers 21 IPS Officers Mahesh Bhagwat Appointed as Hyderabad Police Commissioner

నూతన ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్ ను నియమించారు. నాగిరెడ్డిని సివిల్ సప్లయిస్ కమిషన్ గా బాధ్యతలు కేటాయించారు. ఆ స్థానంలో ఉన్న సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను మైనార్టీ రెసిడెన్షియనల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా కొత్త పోస్టులో నియామకం చేసారు. అకున్ సబర్వాల్ కు లా అండ్ ఆర్డర్ డీజీగా బాధ్యతలు కేటాయించారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాను నియమించారు. ఏసీబీ డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు.

సజ్జనార్ బదిలీతో

సంజయ్ కుమార్ జైన్ ను శిక్షణా కేంద్రం అదనపు డీజీగా నియమించారు. విక్రమ్ మాన్ సింగ్ కు పోలీసు హౌసింగ్ అదనపు బాధ్యతలు కేటాయించారు. ఏసీబీ మల్టీ జోన్ -1 డైరెక్టర్ గా చంద్ర శేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వి అరవింద్ బాబు అదనపు డీసీపీగా వ్యవహరించ నున్నారు. జోగులాంబ జోన్ డీఐజీగా చందనా దీప్తికి బాధ్యతలు కేటాయించారు. అయితే, ఈ నిమాయకాల్లో హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బదిలీలు ఆసక్తిగా మారాయి. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు.. పని తీరు ఆధారంగా ఈ బదిలీలు చేసినట్లు స్పష్టం అవుతోంది. సజ్జనార్ ను ఫైర్ డీజీగా నియమించటం పైన చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+