సోనియా గాంధీ ఏం చదువుకున్నారు? ఎన్ని భాషలు మాట్లాడుతారు?

భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన సోనియా గాంధీ విద్యాభ్యాసం గురించి తరచుగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆమె కేంబ్రిడ్జ్‌లో చదివారని అందరికీ తెలిసినా, అక్కడి ప్రఖ్యాత యూనివర్సిటీలో కాకుండా ఒక ల్యాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ లో చదివారనే విషయం చాలామందికి తెలియదు. ఇటలీలో విదేశీ భాషలు నేర్చుకోవడం దగ్గర మొదలైన ఆమె చదువుల ప్రస్థానం, ఇంగ్లాండ్ మీదుగా సాగి చివరకు భారతదేశంలో ఆర్ట్ కన్జర్వేషన్లో డిప్లొమా చేసే వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆమె జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) ద్వారా ఆమె చదువుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఇటలీలో విదేశీ భాషలపై పట్టు..

సోనియా గాంధీ ప్రాథమిక విద్యాభ్యాసం ఉత్తర ఇటలీలోని టురిన్ నగరంలో గల 'ఇన్‌స్టిట్యూటో శాంటా తెరెసా డి లింగ్వే' అనే సంస్థలో మొదలైంది. ప్రతిరోజూ ఉదయాన్నే బస్సులో వెళ్లి అక్కడ ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ భాషలను అభ్యసించేవారు. ఏ భాషను నేర్పిస్తున్నారో అదే భాషలో పాఠాలు చెప్పడం ఆ సంస్థ ప్రత్యేకత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన తండ్రి ఎదుర్కొన్న అనుభవాలను కథలుగా చెప్పడం వల్ల సోనియాకు రష్యన్ భాషపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. 1964 నాటికి ఆమె అక్కడ ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో మూడేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు.

How Sonia Gandhi Studied Languages in Italy and Cambridge Before Pursuing Art Conservation Diploma in Delhi

కేంబ్రిడ్జ్‌లో ఇంగ్లీష్ కష్టాలు.. ఆపై ప్రశంసలు

ఇటలీలో చదువు పూర్తయ్యాక, ఇంగ్లీష్ భాషపై మరింత పట్టు సాధించేందుకు 19 ఏళ్ల వయసులో సోనియా ఇంగ్లాండ్‌కు వెళ్లారు. మొదట 'జారెట్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్'లో చేరినప్పటికీ, కొత్త దేశం, అక్కడి వాతావరణం, ఆహారం, ముఖ్యంగా స్థానికుల ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థం కాక ఆమె తీవ్ర ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో పాటు భాష రాక ఒకసారి ముగ్గురు భారతీయ స్నేహితులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడినట్లు ఆమె తన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే చదువుపై ఆమె దృష్టి సరిగ్గా లేదని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సోనియా తండ్రికి లేఖ కూడా రాశారు.

ఆయనను బాత్రూంలో బంధించారా? సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలైన వేళ అసలేం జరిగింది?
ఆయనను బాత్రూంలో బంధించారా? సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలైన వేళ అసలేం జరిగింది?

ఆ తర్వాత స్నేహితుల సలహా మేరకు ఆమె కేంబ్రిడ్జ్‌లోని బార్టన్ రోడ్‌లో ఉన్న 'లెనాక్స్ కుక్ స్కూల్'లో చేరారు. అక్కడ మిస్టర్ టర్న్‌బుల్ అనే ఉపాధ్యాయుడి బోధనతో ఆమెకు ఇంగ్లీష్‌పై భయం పోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆమె రాసే ఇంగ్లీష్ ఎంతో సరళంగా, హాస్యభరితంగా ఉందని అక్కడి అధ్యాపకులు ప్రశంసించారు. అలా 1965 జూన్‌లో ఆమె కేంబ్రిడ్జ్‌లోని ఈ పాఠశాల నుంచి ఇంగ్లీష్ సర్టిఫికెట్ పొందారు. సరిగ్గా ఇదే సమయంలో ట్రినిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీతో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి వివాహానికి దారితీసింది.

భారత్‌లో ఆర్ట్ కన్జర్వేషన్ డిప్లొమా.. స్పానిష్ భాషపై మక్కువ

వివాహం తర్వాత భారతదేశానికి వచ్చిన సోనియా గాంధీ తన చదువును ఇక్కడితో ఆపేయలేదు. పురాతన కళాఖండాలు, పెయింటింగ్‌ల పట్ల ఉన్న ఆసక్తితో న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో చేరారు. అక్కడ 'ఆయిల్ పెయింటింగ్స్ సంరక్షణ' (Conservation of Oil Paintings) విభాగంలో ప్రత్యేక శిక్షణ పొంది డిప్లొమా సాధించారు. ఆ తర్వాత ప్రముఖ నిపుణులు సుకాంత బసు మార్గదర్శకత్వంలో పాత పెయింటింగ్‌లను పునరుద్ధరించే పనుల్లోనూ పాలుపంచుకున్నారు. వీటికి తోడు, 1970వ దశకంలో తన స్నేహితురాలు రూపితా చావ్లాతో కలిసి స్పానిష్ భాషను కూడా నేర్చుకున్నారు. ఇలా ఒక సాధారణ భాషా విద్యార్థినిగా మొదలైన ఆమె ప్రయాణం, భిన్న దేశాల్లో, విభిన్న రంగాల్లో నైపుణ్యాలను సంపాదించుకునే స్థాయికి ఎదిగింది.

సోనియమ్మ లవ్ స్టోరీ.. తొలి చూపులోనే మనసును గెలుచుకున్నారు
సోనియమ్మ లవ్ స్టోరీ.. తొలి చూపులోనే మనసును గెలుచుకున్నారు

సోనియా గాంధీ విద్యాభ్యాస వివరాలు:

  • 1964 కంటే ముందు: ఇన్‌స్టిట్యూటో శాంటా తెరెసా డి లింగ్వే (టురిన్, ఇటలీ) - ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ భాషల అభ్యాసం.
  • 1964: టురిన్, ఇటలీ - ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో మూడేళ్ల కోర్సు పూర్తి.
  • 1965 (ప్రారంభం): జారెట్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లాండ్ - ప్రాథమిక ఇంగ్లీష్ భాషా శిక్షణ.
  • 1965 (జూన్): లెనాక్స్ కుక్ స్కూల్, కేంబ్రిడ్జ్ - ఇంగ్లీష్ భాషలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి.
  • వివాహం తర్వాత: నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీ - ఆయిల్ పెయింటింగ్స్ సంరక్షణలో డిప్లొమా.
  • 1970వ దశకం: భారతదేశం - స్నేహితురాలితో కలిసి స్పానిష్ భాషా అభ్యాసం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+