ఈ నెల 30న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమ..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రుణమాఫీ పెండింగ్ నిధులతో పాటు గా వరి బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటన చేసారు. ఈ నెల 30న రైతు పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుంద ని పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది.
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ రుణమాఫీ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న మాఫీ అమలు కాని రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతులకు పలు కారణాలతో రుణమాఫీ అమలు కాలేదు. ఆ తరువాత ప్రభుత్వం వారికి రుణమాఫీ అమలయ్యేలా చర్యలు తీసుకుంది. నాలుగు లక్షల మందికి అర్హత ఉందని గుర్తించింది. వీరికి ఈ నెల 30న రైతు పండుగ కార్యక్రమంలో చెల్లించేలా నిర్ణయం ప్రకటించింది. ఇదే సమయంలో సన్నరకాల ధాన్యంకు సంబంధించి రైతులకు ఇస్తామన్న రూ.500 బోన్‌సను కూడా అదే రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. దీనికి సంబం ధించిన ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ ఉన్నట్లు మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు రూ.50వేల కోట్లు బాకీ పడగా అందులో రూ.12వేల కోట్లను తమ ప్రభుత్వం తీర్చిందని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా చెల్లిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కీలక పత్రాలు మాయమయ్యాయని మంత్రి ఆరోపించారు.












Click it and Unblock the Notifications