హైదరాబాద్ భూములపై కొత్త ఈక్వేషన్లు: ఇకపై కొత్త జోన్లు..!!
హైదరాబాద్‌లో సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్‌లుగా మార్చడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇందులో 4,740 ఎకరాల ప్లాటెడ్ ప్రాంతం కూడా ఉంది. ఈ మార్పునకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో జారీ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల లేదా దాని సమీపంలో ఉన్న పారిశ్రామిక భూములు ఇకపై మల్టీ యూజ్ జోన్లుగా ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు పారిశ్రామిక అవసరాలు, వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు- వాటి అనుబంధ సంస్థల ఏర్పాటుకు మాత్రమే ఈ 9,292 ఎకరాల భూములను వినియోగిస్తూ వచ్చారు. ఇక వీటిని మల్టీ జోన్లుగా వినియోగించుకోవచ్చు. రెసిడెన్షియల్, కమర్షియల్ వంటివి ఆయా భూముల్లో ఏర్పాటు చేయవచ్చు.

మల్టీ యూజ్ జోన్లుగా మార్చడానికి వన్ టైమ్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్ 80 అడుగుల కంటే తక్కువ రోడ్డును ఉన్నట్లయితే.. మార్కెట్ విలువలో 30 శాతం మొత్తాన్ని ఇంపాక్ట్ ఫీజును డీఐఎఫ్ వసూలు చేస్తారు. అదే ప్లాట్ 80 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ రోడ్డును ఎదుర్కొంటే ఈ మొత్తం 50 శాతం వరకు పెరుగుతుంది.
దరఖాస్తుదారులు TG-IPASSలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు మొత్తం ఫీజులో 20 శాతం ముందస్తుగా చెల్లించాలి. మిగిలిన 80 శాతం మొత్తాన్ని 45 రోజుల్లోగా రెండు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులో జాప్యం జరిగితే- ఒక నెల గడువు తర్వాత నుండి ప్రతి నెలా ఒక శాతం జరిమానా విధిస్తారు. నిర్దేశిత సమయం మించిపోతే.. దరఖాస్తుదారు చెల్లించిన మొత్తం రద్దవుతుంది. మళ్లీ దరఖాస్తు చేసే అర్హత కూడా కోల్పోతారు.
దాఖలైన దరఖాస్తులను తెలంగాణ పారిశ్రామిక కార్పొరేషన్ వారం రోజుల్లో ప్రాథమికంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత మరో ఏడు రోజుల్లోగా తుది ఆమోదాన్ని మంజూరు చేస్తుంది. ఈ విధానం జారీ అయిన ఆరు నెలల్లోపు అన్ని దరఖాస్తులు సమర్పించాలి. ఇది ఓ సన్‌సెట్ క్లాజ్‌గా పరిగణిస్తారు. దరఖాస్తుల ప్రాసెసింగ్, లేఅవుట్ సవరణలకు టీజీఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కొత్త విధానం వల్ల హైదరాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని అంచనాలు ఉన్నాయి.
నాచారం ఐడీఏ, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, జీడిమెట్ల ఎస్వీసీఐఈ, బాలానగర్, బాలానగర్ ఎస్వీసీఐఈ, సనత్ నగర్, మెదక్, కుషాయిగూడ, గాంధీనగర్, పటాన్‌చెరు, పాశామైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయత్‌నగర్, చందూలాల్ బారాదరి వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. గతంలో వాటికి కేటాయించిన ధరలు, తాజాగా సవరించిన రేట్లు ఈ జీవోలో పొందుపరిచారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications