హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా పుణ్యమాని!: జనాలు ఆశ్చర్యపోతున్నారు.., ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందంటే..

ఇవాంకా హైదరాబాద్ రాక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నపలంగా రోడ్లను సుందరీకరించి, మౌలిక సదుపాయాల కల్పనను జీహెచ్ఎంసీ యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇవాంకా హైదరాబాద్ రాక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నపలంగా రోడ్లను సుందరీకరించి, మౌలిక సదుపాయాల కల్పనను జీహెచ్ఎంసీ యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తోంది.

ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..

వీవీఐపీలు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడా ఎలాంటి లోపం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, ఫుట్ పాత్ లు, గార్డెనింగ్ పనులు చేయిస్తోంది.

telangana govt spents Rs100crore for city beautification and roads repair

పాతబస్తీలోని చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్ మార్గాల్లో ఇవాంకా రాకపోకలు సాగనుండటంతో.. ఈ మార్గాల్లో పనులను మరింత స్పీడప్ చేశారు. రోడ్డు పక్కన ఉండే గోడలకు రంగురంగుల బొమ్మలు వేయిస్తున్నారు.

చార్మినార్ ను ఇవాంకా సందర్శించే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా మహిళా పర్యాటకుల కోసం షీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ఇప్ప‌టికే న‌గ‌ర‌ మేయ‌ర్ బొంతు రామ్మోహాన్, క‌మీష‌న‌ర్ జ‌నార్ధ‌న్‌రెడ్డి, మున్సిప‌ల్ సెక్రేట‌రీ న‌వీన్ మిట్ట‌ల్ ప‌నుల‌ను ప‌రిశీలించారు.

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో మొత్తంగా ప్రభుత్వం రూ.100కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. కాగా, ఇవాంకా రాకవేళ అధికారుల పనితీరును చూసి జనం షాక్ తింటున్నారు. ఆమె పుణ్యమాని అధికారులు ఇంత బాగా పనిచేస్తున్నారని అనుకుంటున్నారు. ఇవాంకా లాంటివాళ్లు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటే నగరంలో అధికారులు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటారని, అభివృద్ది పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

English summary
Telangana govt spenting Rs 100crores for city beautification and roads repair due to the Global Summit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X