తెలంగాణలో ఆన్‌లైన్ ద్వారా తరగతులు: పిటీషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుదల బాట పట్టాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఇప్పటిదాకా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం నాటితో పోల్చుకుంటే ఒమిక్రాన్ కేసులేవీ కొత్తగా రికార్డు కాలేదు. ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతాయనే గ్యారంటీ లేదు. కరోనా వైరస్ కేసులు పెరుగుతోండటం కలవరానికి గురి చేస్తోంది.

Recommended Video

    Omicron Variant : Omicron Is 70 Times Faster Than Delta | Omicron Cases In India

    ఈ క్రమంలో పాఠశాలలు, విద్యాసంస్థలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

    Telangana HC postponed hearing on the petition to implement Schools to conduct classes through online

    కరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్య డైరెక్టరేట్, పోలీస్ డైరెక్టర్ జనరల్ హైకోర్టుకు నివేదికను సమర్పించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించిన వారిపై పలు కేసులను నమోదు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి.. హైకోర్టుకు వివరించారు. నిబంధనల ఉల్లంఘనలపై మొత్తం 907 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గడువుకు మించి వేడుకలు నిర్వహించిన వారిపై 263 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.

    పబ్లిక్ న్యూసెన్స్‌ కింద 644 కేసులు పెట్టామని హైకోర్టుకు నివేదించారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. కిందటి నెల 24 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 16,430 మందికి జరిమానా వేశామని చెప్పారు. గత ఏడాది జూన్ 20 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు 5,10,837 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వట్లేదని అన్నారు.

    జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హైకోర్టుకు అందజేసిన నివేదికలో వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానాలు, విద్యా సంస్థలు, పాఠశాలలను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించవద్దని, ఆన్ లైన్‌లో చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, పిటీషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+