కొట్లాడి సాధించుకున్న వైఎస్ షర్మిల- తొలి గెలుపు..!!

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన సత్తా నిరూపించుకున్నారు. పాదయాత్రకు ఎక్కడ బ్రేక్ పడిందో.. అక్కడి నుంచే మళ్లీ పునఃప్రారంభించనున్నారు. దీనికి తెలంగాణ హైకోర్టు అనుమతులను మంజూరు చేసింది. ఆమె పాదయాత్ర పునఃప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామం వైఎస్ఆర్టీపీ క్యాడర్‌లో జోష్ నింపింది. తమ అధినాయకురాలు కొట్లాడి సాధించుకుందని, ఇది తమ తొలి గెలుపుగా అభివర్ణిస్తోన్నారు ఆ పార్టీ నాయకులు.

ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే

ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట్‌కు చెందిన టీఆర్ఎస్ శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, కార్యకర్తల దాడి వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన పాదయాత్రను ఇక పునఃప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోన్నామని పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో శంకరంతండా నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేస్తోన్నారు.

షర్మిల సంచలనం..

షర్మిల సంచలనం..

వైఎస్ షర్మిలపై వరంగల్ జిల్లాలో జరిగిన దాడి.. ఆమె అరెస్ట్- ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నాలనూ పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు- జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం దీనిపై స్పందించారు. వైఎస్ షర్మిలను ప్రధాని మోదీ ఫోన్‌లో పరామర్శించారు.

 వరంగల్ పోలీసుల తిరస్కరణతో..

వరంగల్ పోలీసుల తిరస్కరణతో..

పాదయాత్రను పునఃప్రారంభించడానికి అనుమతి కోరుతూ షర్మిల చేసుకున్న దరఖాస్తును ఇదివరకు వరంగల్ పోలీసులు తిరస్కరించిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి ఇవ్వడానికి వారు నిరాకరించారు. వరంగల్ జిల్లా శంకరంతండా వద్ద దాడి జరగడానికి గల కారణాలను వివరించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దిగొద్దంటూ ఇదివరకు షరతులతో కూడిన ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల ఈ దాడి జరిగినట్లు భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

 అనుమతి ఎందుకు నిరాకరించకూడదు..

అనుమతి ఎందుకు నిరాకరించకూడదు..

పాదయాత్ర కోసం చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించకూడదంటూ పోలీసులు వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణకు పాల్పడటం వల్ల జిల్లాల శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లినట్టయిందని పేర్కొన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో పాదయాత్రకు తాత్కాలికంగా మరోసారి బ్రేక్ పడినట్టయింది. నోటీసుల వ్యవహారం పాదయాత్రకు ప్రతిబంధకంగా మారింది అప్పట్ల

 అనుమతుల కోసం దీక్ష..

అనుమతుల కోసం దీక్ష..

పాదయాత్రకు అనుమతులు లభించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష కొనసాగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. షర్మిలను అపోలో ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. దీని తరువాత పాదయాత్రకు అనుమతులను కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

షరతులతో..

షరతులతో..

కాగా వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. షరతులను విధించింది. పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గానీ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. రాజకీయ విమర్శలకు తప్ప ఇతర ఆరోపణలకు గానీ దూషణలకు గానీ అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శించలు చేయొద్దని హైకోర్టు వైఎస్ షర్మిలకు సూచించింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది హైకోర్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+