రిక్రూట్‌మెంట్ విధివిధానాల్లో మార్పులు: కొత్తగా గ్రూప్ - 3 పోస్టులు
హైదరాబాద్: ఉద్యోగాల ఖాళీల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త రిక్రూట్‌మెంట్ విధివిధానాలతో కూడిన ఉత్తర్పులను ప్రభుత్వం బుధవారంనాడు విడుదల చేసింది. కొత్తగా గ్రూప్ - 3 పోస్టులను చేర్చింది.
గ్రూప్ -1 కింద డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఎంపిడివో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్ -1కు 1000 మార్కులతో మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. కొత్తగా పేపర్ -6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం సిలబస్‌ను చేర్చారు.

గ్రూప్ -2 విభాగం కింద 12 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ కింద పురపాలక కమిషనర్, డిప్యూటీ తహిసీల్దార్ ఉద్యోగాలతో పాటు మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ -2కు 675 మార్కలు కేటాయించారు.
మరో 17 రకాల పోస్టులతో కొత్తగా గ్రూప్ -3ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 15 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.












Click it and Unblock the Notifications