కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారా-ఆపారా : విడుదల కాని గెజిట్ -అడ్డు ఏంటి : కారణం ఎవరు..!!
పాడి కౌశిక్ రెడ్డి. యువ నాయకుడిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేత. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరటం .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ సమయంలోనే మరోసారి కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. రేవంత్ కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించటంతో..వెంటనే వెళ్లి కలిసి న కౌశిక్ పార్టీ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావించారు.

కాంగ్రెస్ కు రాజీనామా- టీఆర్ఎస్ లో చేరిక..
కానీ, అప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఒక ప్రయివేటు కార్యక్రమంలో భేటీ అయ్యారు. ఈటల అవినీతి పైన తీవ్ర విమర్శలు చేసారు. అయితే, ఒక ఫోల్ కాల్ ఆడియో ఆయన రాజకీయ భవితను మార్చేసింది. తనకు టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ టిక్కెట్ ఖాయమంటూ ఆ ఫోన్ కాల్ లో కౌశిక్ రెడ్డి చెప్పటం వైరల్ అయింది. దీంతో..అదే రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఆ తరువాత కొద్ది రోజులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

కౌశిక్ రెడ్డి అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఖరారు..
కౌశిక్ రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక, ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రవర్గ సమావేశంలో అనూహ్యంగా కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ కు సిఫార్సు చేసారు. ఇది జరిగి పది రోజులు అయింది. కానీ, ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా నియామకం పైన గజెట్ విడుదల కాలేదు. ఇదే, ఇప్పుడు అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది. గతంలో నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ ఆమోదిస్తే..ఒకటి లేదా రెండు రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేయటం జరిగేది.

జారీ కాని నియామక నోటిఫికేషన్..
కానీ, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ చేసిన నిర్ణయం ఫైల్ గా మారి రాజ్ భవన్ కు వెళ్లి..అక్కడ ఆగిందా..లేక, సీఎంఓలో పెండింగ్ లో ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్ క్రీడాకారుడి హోదాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. దీని పైన గవర్నర్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయయే అవకాశం లేదనే వాదన ఉంది. ఆసలు..కౌశిక్ రెడ్డి నియామక ఫైల్ ఎక్కడ ఉంది.. ఎందుకు ఆగిందనే దాని పైన క్లారిటీ లేదు. గవర్నర్ సైతం రాజ్ భవన్ లో అందుబాటులోనే ఉన్నారు.

గులాబీ పార్టీ నేతల్లో గుబులు..
అయితే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకొన్న తరువాత..హుజూరాబాద్ లో గులాబీ పార్టీకి చెందిన ఒక నేత తన అనుచరులతో సమావేశం అయినట్లు ప్రచారం సాగింది. కౌశిక్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. ఇక, మానుకోట ఘటనలో తెలంగాణ వాదుల పైన రాళ్లు వేసారంటూ ఈటల నేరుగానే కౌశిక్ రెడ్డి పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారు అయిన తరువాత కౌశిక్ సైతం ఎక్కడా రాజకీయంగా స్పందించటం లేదు. కానీ, ఎమ్మెల్సీగా నియామక ఉత్తర్వులు మాత్రం రాలేదు.

ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తే..ఎమ్మెల్సీ పదవి వచ్చినా..
గులాబీ పార్టీలో చేరిన సమయంలో.. టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిలో బరిలో ఉంటారని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా మండలికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పైన పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, కేసీఆర్ నిర్ణయం ఎవరూ ప్రశ్నించే అవకాశం..ఆ సాహసం చేయలేరు. ఇక, హుజూరా బాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్దిగా బీసీ వర్గానికి ఇస్తారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దళిత బంధు ద్వారా తన ఓటింగ్ మరింత బలోపేతం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి.
Recommended Video

నోటిఫికేషన్ వస్తేనే అన్నింటికీ సమాధానం..
కౌశిక్ రెడ్డి కి నియోజకవర్గంలో ఉన్న పట్టు సైతం తమకు కలిసి వస్తుందని భావించి అక్కడ నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అసలు...ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా నియమితులైనట్లుగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అప్పటి వరకు ఈ నిర్ణయం లో మరేదైనా జరుగుతుందా అనే అనుమానాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అధికారిక టీఆర్ఎస్ నేతలే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications