అవమానకర చర్య: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో (deepfake video) అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించారు. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ విషయంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు.
ఓ నేషనల్ ఛానెల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రష్మిక మార్ఫింగ్ వీడియో గురించి ప్రస్తావించారు. అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఆ డీప్ ఫేక్ వీడియో గురించి విషయంలోకి వెళితే.. రష్మిక ముఖాన్ని.. ఓ యువతికి అంటించి మార్ఫింగ్ చేశారు దుండగులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ కామెంట్స్ పెట్టారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు.
ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్‌తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సీరియస్ అయ్యారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత కేంద్ర మంత్రులు కూడా ఈ ఘటనపై సీరియస్‌గా చర్యలకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications