తెలంగాణ జిల్లాలకు హెచ్చరిక

గత రెండు వారాలుగా తెలంగాణలో వర్షాలు కురవడంలేదు. సాధారణంగా జులై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురుస్తాయి. ఈ రెండు నెలలు అన్నదాతలకు ఎంతో కీలకం. మొక్కలు పెరిగే దశ కాబట్టి వర్షాలు అవసరమవుతాయి. అయితే జులై చివరి వారంలో దంచికొట్టిన వర్షాలు రెండు వారాల నుంచి అడ్రస్ లేవు. చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు కురవలేదు. తాజాగా తెలంగాణలోని వర్షాలపై వాతావరణశాఖ అప్ డేట్ ఇచ్చింది. రానున్న మూడురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. బంగ్లాదేశ్, మయన్మార్ దగ్గర ఉన్న మేఘాలను తనవైపు తిప్పుకుంటోంది. అవి ఏపీ, తెలంగాణపై ఆవరించి ఉన్నాయి. నేటి నుంచి వరుసగా మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి- భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Telangana Rain Updates

ఈ ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఆవర్తన ప్రభావం ఉంటుందని.. అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాయలసీమపై దీని ప్రభావం లేదన్నారు. అక్కడ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. బంగాళాఖాతంలో చెన్నైకి దగ్గర్లోనే ఓ చిన్న ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో రాయలసీమలోనూ వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+