కార్పోరేట్ విద్యకు ధీటుగా..
హైదరాబాద్: కార్పోరేట్ విద్యకు ధీటుగా సర్కారీ విద్యను పూర్తి స్థాయిలో అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను బుధవారం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో డిజటల్ తరగతులను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని గాజులమల్కాపురం ఉన్నత పాఠశాలలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి డిజిటల్ తరగతులు ప్రారంభించారు మరోవైపు భద్రాది కొత్తగూడెం జిల్లా దుమ్మపేట మండలం నాచారం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు ప్రారంభించారు..












Click it and Unblock the Notifications