తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు
45 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/R6J2nE7oto
తెలంగాణలో ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియమితులు అయ్యారు. అలాగే విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమిషనర్ గా ఎం. హనుమంతరావులు నియామకం అయ్యారు.

వీరితోపాటు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ముషారఫ్ అలీ ఫారూఖీ TGSPDCL సీఎండీ నుంచి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 3వ డిస్కమ్ సీఎండీగా బదిలీ అయ్యారు. అయితే జితేష్ వి. పాటిల్ TGSPDCL కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా ఉన్న ఎం. హనుమంతరావు నుంచి దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. ఆయనకు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరితోపాటు నారాయణపేట కలెక్టర్ గా ఉన్న సిక్త పట్నాయక్.. ఇప్పుడు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.












Click it and Unblock the Notifications