అమరావతిలో 'తెలుగువారి జ్ఞాపకం': ఎన్టీఆర్ ట్రస్ట్ ఆహ్వానం
ఏపీ రాజధాని అమరావతిలో తెలుగువారి జ్ఞాపకం పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియంను నిర్మించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంకల్పించింది.
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో తెలుగువారి జ్ఞాపకం పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియంను నిర్మించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంకల్పించింది.
ఇందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాల తయారీ కోసం తెలుగు రాష్ట్రాలలోని ప్రతిభగల శిల్ప కళాకారులకు అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భావిస్తుంది.

మ్యూజియం కోసం నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానంలో పోషించిన ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన లైఫ్ సైజు రియలిస్టిక్ శిల్పాలను ఫైబర్ మీడియంలో తయారు చేయవలసి ఉంటుంది.
పాత్రకి సంబంధించిన వస్తువులతో పాటు సహజ దుస్తులతో అలంకరించాలి. ఆసక్తి గలవారు జూన్ 30 లోపు తమ బయోడేటాను మరియు తాము గతంలో తయారుచేసిన రియలిస్టిక్ (సహజత్వం ఉట్టిపడే) శిల్పాలను వివిధ కోణాలలో ఫోటోలు తీసి ట్రస్ట్ అడ్రస్‌కు పంపాలి. శిల్ప కళాకారులు పంపిన చిత్రాల ఆధారంగా వారి నైపుణ్యం గుర్తించి, విగ్రహం తయారీకి సంబంధించిన కాంట్రాక్టు ఇస్తారు.
ఆసక్తి గలవారు [email protected] మెయిల్ లేదా 9100433445 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని ట్రస్ట్ సీఈవో విష్ణువర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications