Weather Update: చలితో వణికిపోతున్న రాష్ట్రం..
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 దాటినా చలి గాలులు వీస్తున్నాయి. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట వాకింగ్ వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. బుధవారం ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ (యూ) మండలంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత మారేడ్‌పల్లిలో 14.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మంచిర్యాలు, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లె, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాలో చలి తీవ్ర ఉంటుందని పేర్కొంది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో చలి తీవ్రత కాస్త తక్కువగా ఉంది. చలి కాలంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. చలితో జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వైరస్ లో ప్లూ, న్యూమోనియా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే పిల్లలకు మందపాటి దుస్తులు వేయాలని చెబుతున్నారు.
చలి కాలం ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికి ఎక్స్ పోజ్ కావొద్దని చెబుతున్నారు. చలి తీవ్రత మరో రెండు నెలలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆహారం కూడా వేడి వేడిగా తీసుకోవాలని చెబుతున్నారు. చికెన్, కోడి గడ్డు, రోయ్యలు తింటే శరీరంలో వేడి పెరుగుతుందని ఆహారనిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications