ఒంటి పూట బడులు ఖరారు - టైమింగ్స్ లో తాజా మార్పులు..!!
తెలంగాణలో పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు. దీంతో, వేసవి సెలవుల వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రోజురోజుకూ ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రంజాన్ మాసం కావటంతో ఉర్దూ పాఠశాలలకు ఇప్పటికే ఒంటి పూట బడులు అమల్లోకి వచ్చాయి. ఇక, ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగ న్నాయి. అటు ఏపీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావర ణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవస రమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ఖరారు చేసారు.












Click it and Unblock the Notifications