ఉద్యోగులకు గుడ్ న్యూస్ - రెండు డీఏల విడుదల..!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా వేచి చూస్తున్న డీఏ బకాయిల పైన ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ చర్చల తరువాత ఈ సాయంత్రం లోగా డీఏ బకాయిల పైన నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి కానుక గా ఉద్యోగులకు పెండింగ్ ఉన్న అయిదు డీఏల్లో రెండు విడుదల చేయనున్నట్లు సమాచారం.
రేవంత్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించనున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. అనేక అంశాల పైన చర్చించారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగుల సమస్యల పైన మంత్రివర్గ ఉప సంఘం చర్చించి..ఆర్దికేతర అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అయిదు డీఏలు బకాయి ఉన్న అంశాన్ని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రికి వివరించాయి.

డీఏల పై చర్చ
చర్చల తరువాత ఉద్యోగులకు రావాల్సినవి ఐదు డీఏలు పెండింగులో ఉండగా, గరిష్ఠంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా చర్చించి, తక్షణ పరిష్కారం చూపేందుకు భట్టి నేతృత్వంలో మరో ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉంటారు. ఈ సాయంత్రం భట్టి, సీఎస్ తో ముఖ్యమంత్రి సమావేశం తరువాత డీఏల పైన ప్రకటన ఉంటుందని సమాచారం.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి సీఎం గారు సమావేశమయ్యారు.
— Telangana CMO (@TelanganaCMO) October 24, 2024
▶️ఉద్యోగుల… pic.twitter.com/qkfBlSRIG8
ఈ రోజు ప్రకటన
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదించిన 50 డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చలు జరిగాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచేందుకే ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ సమావేశం అందుకు తొలిమెట్టని చెప్పారు. పెండింగ్ ఉన్న అయిదు డీఏల్లో నాలుగు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీఎం ఆర్దిక పరిస్థితులు వివరించగా.. తక్షణం మూడైనా ఇవ్వాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి నెలా రూ.22 వేల కోట్ల ఖర్చులు ఉంటే ప్రభుత్వ రాబడి రూ.18 వేల కోట్లే ఉందని ప్రస్తావించారు. అయితే, ఉద్యోగ సంఘాల కోరిక మేరకు రెండు డీఏలు విడుదలకు ఈ రోజు సానుకూల ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications