పాత రేషన్ కార్డుల కొనసాగింపు, మార్పుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసింది. కొత్తగా జారీ చేసే కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రతీ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వాలని నిర్ణయించింది. డిజైన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ కార్డుల కొనసాగింపు.. మార్పుల పైన పౌర సరఫరాల శాఖ తాజాగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.
కొత్త కార్డుల జారీ
తెలంగాణలో కొత్త కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. కొత్తగా రేషన్ కార్డు లను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు లక్షల సంఖ్యలో ఉండటంతో... వారిలో అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నారు. ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

పాత కార్డులు సైతం
ఇప్పటికే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్దేశిత సమయం కంటే ఆలస్యం అయింది. స్మార్ట్ కార్డు రూపంలో రేషన్‌కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలకు మార్చి 25న తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీబిడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని తెలిపింది. కుటుంబ యజమానిగా మహిళల పేరుతోనే రేషన్‌కార్డులు ఉన్నాయి.
జారీ ప్రక్రియ
స్మార్ట్ రేషన్‌కార్డులను మహిళలో ఫొటోతోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ తెలుస్తాయి. రాష్ట్రం లో ఈ విధానం అమలుకు సంబంధించి అధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యాయనం చేసింది. ఇక.. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications