ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ - బకాయిలు విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేసింది. గత ప్రభుత్వ హయం నుంచి బకాయిలు ఉన్న వాటిని క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోనాలు పండుగ ప్రారంభం వేళ ఉద్యోగులు.. పెన్షనర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో, ఉద్యోగులు.. పెన్షనర్లకు ఊరట లభించనుంది.
తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ. 180.30 కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్ చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీని వల్ల 26, 519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుందన్నారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులనూ సైతం క్లియర్ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయినా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్దిక సమస్యలు ఎదుర్కుంటూనే ప్రతీ హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు బిల్లుల చెల్లింపు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు భట్టి పేర్కొన్నారు. ఆర్దికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగులు ప్రస్తావిస్తున్న ఇతర అంశాల పైన ప్రభుత్వం సానుకూల ఆలోచనతో ఉందని.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల కు ప్రాధాన్యత ఇస్తున్నామని విశ్లేషించారు. ఇతర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతుల ఖాతాల్లోనూ ప్రభుత్వం తొమ్మది రోజుల్లోనే చెప్పిన విధంగా రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసింది.












Click it and Unblock the Notifications