శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్ , పండగ వేళ ఈ రూట్లలో భారీ టికెట్ రాయితీ..!!
పండుగల వేళ ఆర్టీసీ ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ టికెట్ రేట్లను తగ్గించింది. హైదరాబాద్- తిరుపతి రూట్‌లో లహరి, రాజధాని ఏసీ బస్సుల తో పాటుగా సూపర్ లగ్జరీ బస్సుల్లో టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. బస్సులు - రూట్లు.. రాయితీ వివరాలను అధికారులు వెల్లడించారు.
తిరుపతి వెంకన్న భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. హైదరాబాద్- తిరుపతి రూట్‌లో లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో 10 శాతం, సూపర్ లగ్జరీ బస్సుల్లో 155 టిక్కెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. అంతేకాదు హైదరాబాద్ నుంచి ఏపీలోని రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నంతో సహా మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు నడిచే లహరి నాన్‌ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి ఏసీ, రాజధాని ఏసీలో10% టిక్కెట్ ధరల్లో తగ్గింపు ఇచ్చింది.

హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే లహరి (నాన్ ఏసీ), సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ ధరపై 15శాతం తగ్గింపు ప్రకటించగా.. లహరి (ఏసీ), రాజధాని (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 10శాతం తగ్గిస్తూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి కడప, అనంతపురం, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, వైజాగ్, తిరుపతి, అమలాపురం, కాకినాడ, గుంటూరు, తెనాలి, ఆదోని, చీరాల, ఏలూరు, గుడివాడ, కర్నూల్, మాచర్ల, మచిలిపట్నం, మార్కాపురం, నంద్యాల, పామూరు, ఉదయగిరి, వింజమూరు, ధర్మవరం, తాడిపత్రి, రాజమండ్రి వయా ఖమ్మం, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే లహరి (నాన్ ఏసీ), సూపర్ లగ్జరీ, లహరి (ఏసీ), రాజధాని (ఏసీ) బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లను తగ్గించింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఈ-గరుడ (E-Garuda) ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ ధరపై 26శాతం రాయితీని అందజేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications