బ్రేకప్ చెప్పిందనే కోపంతో.. కత్తితో ప్రియురాలిపై దాడిచేసిన ప్రియుడు..
ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో ఎన్నో ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రేమపేరుతో వారిని వారు బలిచేసుకోవడం లేకపోతే ప్రేమించిన వారి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వారిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం... వారి చిన్ననాటి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలిపై ఆఘాయిత్యానికి పాల్పడాడ్డు ప్రియుడు. ఈ సంఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
చిన్ననాటి స్నేహితులు..:హైదరబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఎఈ కాలనీకి చెందినవాడు వంశీ. ఈ అబ్బాయి తన్న చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. ఆమె మౌలాలి ఎంజే కాలనీకి చెందినది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుతుండడం వల్ల వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ కీసరలోని ఇంజనీరంగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. ఎన్నో యేళ్ల నుంచి వీరిద్దరీ మధ్య ఈ ప్రేమ కొనసాగుతుంది. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఆ యువతి వంశీని దూరం పెట్టడం ప్రారంభించింది. ఇక నుంచి తనకు దూరంగా ఉండాలని, ప్రేమ గురించి ఇక మరిచిపోవాలని వంశీతో చెప్పింది.

ముందుగా కత్తితో యువతిని పొడిచి, తర్వాత తనను పొడుచుకున్నాడు..:ఆ యువతి చేసిన పనికి వంశీకి షాక్‌లా అనిపించింది. ఆ విషయాన్ని తను జీర్ణించుకోలేకపోయాడు. ఆ ఆవేశంలో ప్రియురాలిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడువుగా శనివారం ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా కలుద్దాం రమ్మన్నాడు. తను ముందుగా అనుకున్నట్లు ప్రియురాలిని చంపేందుకు అన్నీ తన వెంట తెచ్చకున్నాడు వంశీ. వీరిద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో బయలుదేరారు. ఆ కాలనీకి సమీపంలో ఓ చోట కారు ఆపాడు వంశీ. తన వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు వంశీ. ఆ యువతి కడుపు, మెడ భాగంలో తీవ్రంగా గాయాలవడంతో ప్రాణభయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాంతో చుట్టుపక్కలా ఉన్న జనం అంతా కారు దగ్గరికి చేరారు. కారుచుట్టు జనాలను చూసిన వంశీ అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా వీరిద్దరూ రక్తపు మడుగులతో కారులో ఉన్నారు. కారుచుట్టు ఉన్నజనం వెంటనే కారు అద్దాలు పగులగొట్టి డోర్ తీశారు. ఆ ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పిందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications