జూబ్లీహిల్స్ పోలింగ్ వేళ ఈసీ అనూహ్య నిర్ణయం - కలిసొచ్చేదెవరికి..!?
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సాయంత్రంతో ఉప ఎన్నిక ప్రచారం మగియనుంది. మంగళవారం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పార్టీలు తమ చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. మూడు ప్రధాన పార్టీల కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. కాగా, ఇదే సమయంలో జూబ్లీహిల్స్ కేంద్రంగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు కీలక చర్చగా మారుతోంది.
జూబ్లీహిల్స్ పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి తుది ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. ప్రధాన నేతలు వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని వ్యూహాలు రచిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అమలుకు సూచనలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్, పలు వురు మంత్రులు ప్రచారం చేసారు. అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తమ పార్టీ అభ్యర్ధి గెలుపును తన భుజస్కందాల పై వేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలం పార్టీ అభ్యర్ధి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. మూడు పార్టీల నేతలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఇదే సమయంలో ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం పోలింగ్ వేళ ఆసక్తిగా మారుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్ ఏడు గంటల నుంచి ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగనున్నది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించనున్నారు. పోలింగ్ శాతాలకు అనుగుణంగా పార్టీలు తమ గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. దాదాపు 4 లక్షల ఓటర్లు జూబ్లీహిల్స్ లో ఉన్నారు. ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు పోలింగ్ కోసం మరో గంట పెరగటంతో.. ఏ మేర పోలింగ్ నమోదు అవుతుందీ.. ఎవరికి కలిసి వస్తుందనే ఆసక్తి కర చర్చ కొసాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications