Telangana: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో సెక్యూరిటీ మార్పు..!
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న సెక్యూరిటీ మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ భద్రత బాధ్యతలను (టీజీఎస్పీ) ప్రత్యేక పోలీస్ విభాగం స్థానం నుంచి టీజీఎస్పీఎఫ్‌కు మార్చారు.తెలంగాణలో ఏక్ స్టేట్-ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసనలతో ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల జారీ చేసింది. అందుకే సచివాలయంలో భద్రతను మార్చారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 30న రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ ఇంటి వద్ద కూడా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెటాలియన్ కానిస్టేబుళ్లకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వద్దని ఉన్నతాధికారులు వారించినా వారు పట్టించుకోలేదు.

ఆందోళనకు కారణమైన పలువురు టీజీఎస్పీ పోలీసులను సర్వీస్ నుంచి తొలగించింది. తొలగించిన వారిలో వారిలో మూడో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ రవి కుమార్, ఆరో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ భూషణ్ రావు, 12 వ బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్ కే షఫీ. 17వ బెటాలియన్ కు చెందిన ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు లక్ష్మీ నారాయణ, కరుణాకర్ రెడ్డి, వంశీ, అశోక్ , శ్రీనివాస్ ఉన్నారు. కొందరిని సస్పెండ్ కూడా చేశారు. 39 మందిని సస్పెండ్ చేశారు.
దీంతో టీజీఎస్పీ పోలీసులు వెనక్కి తగ్గారు. టీజీఎస్పీ పోలీసులు విధుల్లో చేరినప్పుడే ఈ విభాగం గురించి వారికి తెలుసని.. నచ్చకపోతే అప్పుడే రావొద్దు కదా.. టీజీఎస్పీ గురించి తెలిసి.. చేరి ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications