Alert: రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు చుక్కలే..!
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయని పేర్కొంది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయని చెప్పింది.
మార్చి చివరి నాటికి కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వారం క్రితం వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతోన్నాయి. ఈసారి ఎండకాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలోని ఉష్ణోగ్రతలు ఎల్బీ నగర్‌లో 36 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. బేగంపేటలో 35 డిగ్రీలు, జూబ్లీ హిల్స్‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ మేరకు రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. త్వరలో వడ గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలని కోరుతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లడం తగ్గించుకోవాలని సూచించారు.
అత్యవసరం అయితే బయటకు వెళ్లాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒక బయటకు వెళ్లినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications