Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మునుగోడు భూములను కొల్లగొట్టేందుకే గులాబీ నేతల ఆగడాలు.!మండిపడ్డ బండి సంజయ్.!

మునుగోడు/హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు 40వేల రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షో ప్రారంభించారు.

మునుగోడు భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు..

మునుగోడు భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు..

తెలంగాణలో యుద్దం స్టార్ట్ అయ్యిందని, రాక్షసులకు, రామ దండు మధ్య యుద్దం మొదలైందన్నారు బండి సంజయ్. సిద్దిపేటలో ఆడోళ్ల పుస్తెల తాడును తెంపుకొచ్చిన టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడు మీద పడ్డదని ఎద్దేవా చేసారు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం మని, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏమొచ్చిందని అన్నోళ్లంతా ఇయాళ ఈడనే ఉన్నారని బండి సంజయ్ గుర్తు చేసారు. ఏకంగా 15 మంది మంత్రులు, 86 ఎమ్మెల్యేలంతా మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకొచ్చిండ్రని, అడిగిందల్లా ఇస్తమని ఆశ చూపుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు బాట..

మునుగోడులో ఇంటింటికీ తిరిగి డబ్బులను పంచేందుకు టీఆర్ఎసోళ్లు సిద్ధమయ్యారని, అవన్నీ పేదోళ్ల రక్తం తాగి సంపాదించిన పైసలేనన్నారు సంజయ్. కేంద్ర నిధులన్నీ దారి మళ్లించిన సొమ్ము అదేనన్నారు. పేదోళ్లు పైసలు పడేస్తే ఓట్లేస్తారని సీఎం చంద్రశేఖర్ రావు అనుకుంటున్నాడని అన్నారు. ఆ పైసలన్నీ పక్కా తీసుకోండి... ఓటు యాడ గుద్దాలో ఆడ గుద్ది టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలే అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతలు సంపాదించిన డబ్బలు సరిపోనట్లున్నయ్... ఇప్పుడు టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు భూములమీద పడ్డాయని బండి సంజయ్ విరుచుకు పడ్డారు.

టీఆర్ఎస్ పాలనలో మోసపోయినోళ్లంతా పువ్వు గుర్తుకే ఓటేయండి..

హుజూరాబాద్, దుబ్బాకలో ఎన్నికలొచ్చినయ్ కాబట్టే అక్కడ అంతో ఇంతో అభివ్రుద్ధికి నిధులొచ్చినయాని, మునుగోడులో కూడా అంతే నన్నారు బండి సంజయ్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగనే,గట్టుప్పల్ మండలం ఏర్పాటైందని, కొత్త రోడ్లు మంజూరైతున్నయాన్నారు. గొర్లకు డబ్బులొస్తున్నయ్. ఇన్నాళ్లుగా దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్లు ఇయ్యాలని అడిగితే ఏనాడూ పట్టించుకోని చంద్రశేఖర్ రావు, ఎన్నికలు రాంగనే అన్నీ ఇస్తమని ఆశపెడుతున్నడని మండి పడ్డారు. ఇన్ని చేసినా ఉప ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందని సర్వేల రిపోర్టులు రాంగనే చంద్రశేఖర్ రావుకు భయం పట్టుకుని జ్వరం వచ్చిందని, ఏం చేయాలో తెల్వక ఢిల్లీకే పారిపోయాడని చురకలంటించారు.

గులాబీ పార్టీకి కోర్టులో చుక్కెదురు..

గులాబీ పార్టీకి కోర్టులో చుక్కెదురు..

న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయం తో ఎదో ఒక వంక తో ఎన్నికలను ఆపాలని టీఆరెస్ కుట్ర చేస్తోంది.
అందులో భాగంగానే ఇండిపెండెంట్ ల 8 గుర్తుల రద్దు చేయాలని టీఆరెస్ కోర్టును ఆశ్రయించింది. టీఆరెస్ ఎన్ని కుట్రలు చేసినా *చివరకు న్యాయం గెలుస్తుంది- మునుగొడులో బీజేపీ గెలుస్తుంది.

బీజేపీ కి న్యాయస్థానం పై గౌరవం ఉంది. ఈ గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నుంచి ఉన్నాయి. ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో. కేవలం ఎన్నికలను ఆపాలన్న దురుద్దేశం తోనే టీఆరెస్ రిట్ పిటీషన్ వేసింది. కానీ న్యాస్థానం ముందు టీఆరెస్ కుతంత్రాలు పనిచేయలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+