Rohith Reddy: రోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై స్టేకు నిరాకరణ..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.

పిటిషన్
ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రోహిత్‌రెడ్డికి వందకోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మనీలాండరింగ్
ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదన్న వాదనలు వినిపించారు. ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదన్నారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందన్న రోహిత్‌రెడ్డి అన్నారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.

సీబీఐ
కాగా మంగళవారం రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రోహిత్ నురెండు రోజుల పాటు ప్రశ్నించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని పిలిచారు. కానీ ఆయన విచారణకు వెళ్లలేదు. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అప్పిల్ కు వెళ్లాలా లేక సుప్రీంకు వెళ్లాలా ప్రభుత్వం ఇంకా నిర్ణయించుకోలేదు.

సిట్
అయితే, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించడాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తప్పుబట్టారు. సిట్ దర్యాఫ్తు సజావుగా సాగుతుండగా కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బిజెపి కొత్త కుట్రలకు తెరలేపింది అని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దింపి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం తగ్గేది లేదని పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.












Click it and Unblock the Notifications