TS Eamcet 2023: బుధవారం నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు..

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) బుధవారం ప్రారంభం కానుంది. మే 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 12,13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ఆన్ లైన్ నిర్వహిస్తుండడం వల్ల 5 రోజులు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంసెట్ కు సంబంధించి తెలంగాణలో 104 సెంటర్లు, ఏపీలో 33 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ లో పొందుపరిచిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష హాజరయ్యే విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు వంటివి తీసుకురావొద్దని చెప్పారు. పరీక్ష కేంద్రానికి గంట ముంద రావాలని సూచించారు. అవసరమైత ఒక రోజు ముందే సెంటర్ వద్దకు వచ్చి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు.

tsemcet

అలస్యమైతే పరీక్ష కేంద్రానికి అనుమతించమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్ కు ఇంటర్ వెయిటేజ్ రద్ద చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారు రాష్ట్రంలోని కళాశాలలు అందించే BE, BTech, BPharmacy, BSc, BVSc, PharmDలతో సహా మొదటి-సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి అర్హులవుతారు. ఎంసెట్ కు భద్రత పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు పేపర్ లీకేజీలు ఘటనలు జరగడంతో ఎంసెట్ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మరోవైపు మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి అయినట్లు సబిత వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61.88 శాతం, రెండో సంవత్సరంలో 63.49 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ బాలికలు టాప్ లో నిలిచారు.తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ ఫలితాలను https://tsbienew.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+