వీళ్లకేం పోయే కాలం.. ఆఖరికి చెప్పులు, బూట్లు కూడా ఎత్తుకెళ్లారు.. (వీడియో వైరల్)
Hyderabad: ఈ రోజుల్లో దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లుగా దొంగలు తయారయ్యారు. కంటికి ఏది మంచిగా కనిపించినా ఎత్తుకెళ్లే పరిస్థితి దాపురించింది. కొన్ని చోరీ ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. చివరకు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగర పరిధిలోని మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బూట్లు, చెప్పుల దొంగల బీభత్సం సృష్టించారు. మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు హైరానా పడ్డారు. ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్సైకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఇతర ఫ్లాట్లలో నివసించే వారు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటామని చెప్పడంతో సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. కాలనీకీ రాత్రి పూట ఆటోరిక్షాలో వచ్చిన కొంత మంది వ్యక్తులు పాదరక్షలను దొంగిలించారని వారు తెలుసుకున్నారు.

ఆ వీడియోలో దొంగలు అపార్ట్మెంట్ భవనాల్లోకి ప్రవేశించి పాదరక్షలను దొంగిలిస్తున్నట్లు చూడవచ్చు. ఈ నేపథ్యంలో మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు పాదరక్షల దొంగల కోసం గాలిస్తున్నారు.
పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025
హైదరాబాద్ - మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బూట్లు, చెప్పుల దొంగల బీభత్సం
మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్ళిన దొంగలు
ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్,… pic.twitter.com/BCXEwxWY7z












Click it and Unblock the Notifications